![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -486 లో.. మీరా కడుపులో ఉన్నది కృష్ణ, మురారిల బిడ్డ అని మధు ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. మీరా నాటకం ఆడిందని సరోగసీ మదర్‌గా మీరానే కృష్ణ, మురారిలకు తెలీకుండా ఉందని చెప్తాడు. మీరా మధు చెప్పేది అంతా అబద్ధం అని పెళ్లి కాకుండా సరోగసీ మదర్‌గా ఉండటానికి తానెందుకు ఇష్టపడతాను అని ప్రశ్నిస్తూ తన నాటకం మొదలు పెడుతుంది.
ఎందుకంటే ముందు మురారి బిడ్డకు తల్లి అయి తర్వాత మురారికి భార్య కావాలి అనుకున్నావ్ కాబట్టి. పెద్దమ్మ జరిగింది ఇదే పెద్దమ్మ. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డ ద్వారా తనకు మురారికి సంబంధం ఉందని నాటకం ఆడి మనల్ని నమ్మించాలి అనుకుంది. మురారినే తండ్రి కాబట్టి డీఎన్‌ఏ టెస్ట్‌కి కూడా సిద్ధమైందని మధు అనగానే.. అసలు డీఎన్‌ఏ టెస్ట్ చేయాల్సింది ఏసీపీ సార్‌కి కాదు మధు నాకు. అప్పుడే ఆ బిడ్డకు తల్లిని నేను అని రిజల్ట్ వస్తుందని కృష్ణ అంటుంది. సూపర్ కృష్ణ. ఇప్పుడు చెప్పు డీఎన్ఏ టెస్ట్‌కి రెడీయేనా అని మధు అంటాడు. సరోగసీ ప్రాసెస్ చాలా కష్టమని రిపోర్ట్ చూపించమని ముకుంద అంటే కృష్ణ డాక్టర్ దగ్గరకే వెళ్దామని అంటుంది. అందరూ డాక్టర్ దగ్గరకు బయల్దేరుతారు. హాస్పిటల్ దగ్గర ముకుంద ఏడుస్తుంటే కృష్ణ దొంగ ఏడుపులు ఆపమని డాక్టర్ నీ అసలు రంగు తేల్చుతుంది అని అంటుంది. ఏ డాక్టర్ అలా చెప్తుందో నేను చూస్తాను అని ముకుంద అంటుంది. ఇక డాక్టర్ దగ్గరకు కృష్ణ వెళ్తుంది. వైదేహి డాక్టర్‌కి మీరా సైగ చేయడంతో డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది. కృష్ణదే తప్పు అన్నట్లు డాక్టర్ అనేస్తుంది. సాటి డాక్టర్‌కి ఇంత అన్యాయం చేయడం మంచిది కాదు అని కృష్ణ అంటుంది. సరోగసీ ఏం చేయలేదు అని డాక్టర్ ప్లేట్ తిప్పేస్తుంది. ఇక అదంతా గమనించిన రజిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే.. రజిని మాటలు పట్టించుకోవద్దు అని నిజం తాను నిరూపిస్తాను అని కృష్ణ అంటుంది. భవాని కృష్ణతో ఇంటి పరువు తీసేశావు అని అంటుంది. భవానితో కృష్ణ మాట్లాడాలి అని ప్రయత్నిస్తే భవాని మాట్లాడను అని అంటుంది. నిజం నిరూపిస్తాను అని కొంచెం ఓపిక పట్టమని ఇద్దరు అత్తలను కృష్ణ వేడుకుంటుంది.
మరోవైపు ముకుంద బ్యాగ్ పట్టుకొని వస్తుంది. తన బిడ్డను తాను తీసుకొని వెళ్లిపోతాను అని బయల్దేరుతుంది. ఒక్కరు కూడా తన గురించి ఆలోచించడం లేదు అని ముకుంద భవాని దగ్గర మొసలి కన్నీళ్లు కార్చుతుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. కృష్ణ ముకుందని అడ్డుకొని ఎవరి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావ్.. చంపేస్తా అని అంటుంది. ముకుంద గొంతు పట్టుకొని నువ్వు చేసిన పనులకు ఎప్పుడో చంపేసేదాన్ని అని కడుపులో ఉన్న నా బిడ్డ కోసం నిన్ను వదిలేస్తున్నా అని అంటుంది. మధు కలుగజేసుకొని న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడమని అంటాడు. మురారి వచ్చే వరకు ఇక్కడే ఉండమని ఏసీపీ సార్ వచ్చాక లాంఛనాలతో నిన్ను బయటకు పంపిస్తాను అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |